Vijayawada: రెచ్చిపోయిన రౌడీగ్యాంగ్‌.. వివాహిత ఇంటికెళ్లి కత్తులతో దాడి

Vijayawada: రెచ్చిపోయిన రౌడీగ్యాంగ్‌.. వివాహిత ఇంటికెళ్లి కత్తులతో దాడి
తనపట్ల అసభ్యంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ ప్రశ్నించిన పాపానికి కత్తులతో దాడి చేశారు వడ్దాది బ్రదర్స్‌

విజయవాడలో రౌడీగ్యాంగ్‌ రెచ్చిపోయింది. తనపట్ల అసభ్యంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ ప్రశ్నించిన పాపానికి.. ఓ వివాహిత ఇంటికెళ్లి కత్తులతో దాడి చేశారు వడ్దాది బ్రదర్స్‌. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు, ఆమె మరిది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి ఫిర్యాదుతో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఇక మహిళను వేధిస్తున్న వడ్డాది బ్రదర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags

Next Story