VIJAYAWADA: విజయవాడలో డయేరియా విజృంభణ

VIJAYAWADA: విజయవాడలో డయేరియా విజృంభణ
X
ఆందోళన అవసరం లేదన్న మంత్రి

వి­జ­య­వా­డ­లో డయే­రి­యా వి­జృం­భి­స్తోం­ది. కే­సు­లు రోజు రో­జు­కు పె­రు­గు­తు­న్నా­యి. ఇప్ప­టి­కే బా­ధ్య­తల సం­ఖ్య 100 దా­టిం­ది. ఆసు­ప­త్రి­కి వచ్చిన వా­ళ్ళం­ద­రూ కూడా నీ­ర­సం, వాం­తు­లు వి­రో­చ­నా­ల­తో వస్తు­న్న­టు­వం­టి పరి­స్థి­తు­లు ఉన్నా­యి. వా­రం­ద­రి­కీ కొ­త్త రా­జ­రా­జే­శ్వ­రి­పే­ట­లో­నే మొ­త్తం మూడు వా­ర్డు­లు­గా ఏర్పా­టు చేసి వా­ర్డు­కు ఆరు నుం­చి ఏడు బె­డ్ల వరకు కూడా ఏర్పా­టు చేసి.. అంటే దా­దా­పు 20 బె­డ్ల వరకు కూడా అం­దు­బా­టు­లో ఉం­డే­లా­గా అధి­కా­రు­లు స్థా­ని­కం­గా ఏర్పా­టు చే­శా­రు. ప్ర­భు­త్వ ఆసు­ప­త్రి­లో కూడా 34 బె­డ్ల­తో ఒక వా­ర్డు­ను కూడా ఏర్పా­టు చే­శా­రు. ఇం­కొక వా­ర్డు­ను కూడా 24 బె­డ్ల­తో ఏర్పా­టు చే­సి­న­ట్లు సమా­చా­రం.

పాత రా­జ­రా­జే­శ్వ­రి­పే­ట­కి ఈ పరి­స్థి­తి రా­వ­డం­తో సర్వే చే­స్తు­న్నా­ర­ని తె­లు­స్తుం­ది. కచ్చి­తం­గా ఈ పరి­స్థి­తి­ని అదు­పు­లో ఉం­చ­డా­ని­కి ప్ర­భు­త్వం అన్ని రకాల చర్య­లు తీ­సు­కుం­టు­న్న­టు­వం­టి పరి­స్థి­తి కన­ప­డు­తుం­ది. ఇం­కొక పక్కన బా­ధి­తల సం­ఖ్య అయి­తే వర­స­గా పె­రు­గు­తూ వస్తు­న్నా అం­దు­కు తగ్గ సే­వ­లు అం­దిం­చి­స్తు­న్నా­రు. బా­ధి­తు­ల­కు సరి­యైన వై­ద్యం అం­దిం­చేం­దు­కు అన్ని చర్య­లు తీ­సు­కు­న్నా­రు.

"డయేరియాతో ఎవ్వరూ చనిపోలేదు"

డయే­రి­యా కే­సు­లు నమో­దైన వి­జ­య­వా­డ­లో­ని న్యూ­రా­జ­రా­జే­శ్వ­రి­పే­ట­లో ప్ర­స్తు­తం పరి­స్థి­తి అదు­పు­లో­నే ఉం­ద­ని వై­ద్యఆ­రో­గ్య­శాఖ మం­త్రి సత్య­కు­మా­ర్‌ తె­లి­పా­రు. ప్ర­భు­త్వ పరం­గా అన్ని జా­గ్ర­త్త­లు తీ­సు­కుం­టు­న్నా­మ­న్నా­రు. మరో మం­త్రి నా­రా­యణ, ఎంపీ కే­శి­నే­ని చి­న్ని­తో కలి­సి డయే­రి­యా ప్ర­భా­విత ప్రాం­తం­లో ఆయన పర్య­టిం­చి బా­ధి­తు­ల­ను పరా­మ­ర్శిం­చా­రు. ప్ర­భు­త్వం తర­ఫున చే­ప­ట్టిన చర్య­ల­ను మం­త్రు­ల­కు అధి­కా­రు­లు వి­వ­రిం­చా­రు. ‘‘మం­చి­నీ­టి పై­పు­లై­న్‌, అం­డ­ర్‌ గ్రౌం­డ్‌ నీటి నమూ­నా­ల­ను పరీ­క్ష­కు పం­పాం. నె­గె­టి­వ్‌ రి­పో­ర్టు వచ్చి­నా మం­చి­నీ­టి సర­ఫ­రా ని­లి­పి­వే­శాం. బయట నుం­చి మి­న­ర­ల్‌ వా­ట­ర్‌ క్యా­న్ల­తో సర­ఫ­రా చే­స్తు­న్నాం. అన్ని శాఖల అధి­కా­రు­లు సమ­న్వ­యం­తో పని­చే­స్తు­న్నా­రు. స్థా­ని­కు­ల­తో మా­ట్లా­డి పరి­స్థి­తి­ని తె­లు­సు­కు­న్నాం. ఇం­టిం­టి­కీ మం­దు­లు ఇచ్చాం. డయే­రి­యా­తో ఎవరూ చని­పో­లే­దు.. వదం­తు­లు నమ్మొ­ద్దు. రెం­డో విడత నమూ­నా­ల­ను కూడా ల్యా­బ్‌­కు పం­పాం’’ అని మం­త్రి సత్య­కు­మా­ర్‌ తె­లి­పా­రు.

Tags

Next Story