దివ్యహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి.. ఆ ఇద్దరికి రహస్యంగా పెళ్లి!

బెజవాడ దివ్యహత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. హత్యకు గురైన దివ్య, నాగేంద్రలు రహస్యంగా పెళ్లిచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. లాక్ డౌన్ సమయంలో వీరు వివాహం చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పెళ్లితర్వాత వీరు ఎవరికి అనుమానం రాకుండా ఎవరింటికి వారు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లివిషయం తెలిసి దివ్యను తల్లిదండ్రులు మందలించారు. నాగేంద్ర మంచివాడుకాదని, దివ్యకు నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. దీంతో దివ్య గత కొంతకాలంగా నాగేంద్రకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. హత్యకు ముందురోజు రాత్రి దివ్య ఇంటి వద్ద నాగేంద్ర గొడవకు దిగినట్లు తెలుస్తోంది. గంజాయికి అలవాటు పడ్డ నాగేంద్ర ఆ మత్తులో దివ్యను హత్యకేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే నిందితుడు నాగేంద్ర వెర్షన్ మరోలా ఉంది.తమ ఇద్దరికి 13 ఏళ్లుగా పరిచయం ఉందన్నాడు. లాక్‌డౌన్ సమయంలో తామిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకున్నామని, దివ్య తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసన్నాడు. తమ పెళ్లిని దివ్య పేరెంట్స్ అంగీకరించకపోవడంతో ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని నిందితుడు నాగేంద్ర చెబుతున్నాడు. ఎవరి గొంతు వారు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించామని చెప్పుకొచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com