సింహాలు మాయంపై ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసిన దుర్గగుడి ఛైర్మన్‌

సింహాలు మాయంపై ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసిన దుర్గగుడి ఛైర్మన్‌

దుర్గగుడి రథం సింహాలు మాయంపై... ఆలయ కమిటీ ఛైర్మన్‌ సోమినాయుడు, ఈవో సురేశ్‌ ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన వెలుగులోకి వచ్చి రెండు రోజులు గడచిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. రికార్డులు పరిశీలించాలని, లాకర్‌లో ఉన్నాయేమో చూడాలంటూ ఈవో సురేశ్‌బాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు పోలీసుల కంప్లయింట్‌ ఇవ్వడంతో.. సింహాలు మాయమైనట్టు అధికారికంగా అంగీకరించినట్టయింది. దుర్గగుడి రథాన్ని 17 నెలలుగా తీయలేదని ఆలయ కమిటీ ఛైర్మన్‌ సోమినాయుడు తెలిపారు. సింహాలు ఎవరి హయాంలో పోయాయో చెప్పలేమని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని.. విపక్షాలు అనవసరంగా బురద చల్లడం సరికాదని మండిపడ్డారు.

Tags

Next Story