Vishakha: తర్లువాడ భూబాగోతాన్ని వెలుగులోకి తెచ్చిన టీవీ5

Vishakha: తర్లువాడ భూబాగోతాన్ని వెలుగులోకి తెచ్చిన టీవీ5
వరస కథనాలతో వెలుగులోకి..వాస్తవాలు టీవీ5 కథనాలతో ఏపీ వ్యాప్తంగా ప్రకంపనలు

విశాఖ జిల్లా తర్లువాడ భూబాగోతాన్ని టీవీ5 వెలుగులోకి తెచ్చింది. వరస కథనాలతో వాస్తవాలను బయట పెట్టింది. టీవీ5 కథనాలతో ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రకంపనలు చెలరేగాయి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భూ కేటాయింపు ప్రతిపాదనలపై స్థానికులు ప్రజాసంఘాలు,ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.ఈ వ్యవహారం పై ఆందోళనకు దిగుతున్నాయి. టీవీ5 కథనాలపై ప్రభుత్వ పెద్దల్లో మొదలైన వణుకు మొదలైంది. తర్లువాడ సెగ తాడేపల్లి ప్యాలెస్‌కి తాకింది. టీవీ5 కథనాలపై ముఖ్యనేతలు చర్చలపై చర్చలు సాగుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఉత్తరాంధ్రనేతలు గుర్రుగా ఉన్నారట..ఇటు అధికారులు కూడా జగన్‌తో ఇలాంటి వ్యవహారాలను గుర్తుతెచ్చుకుంటూ ఫైల్‌ ముట్టుకోవడానకి సాహాసం చేయడం లేదు. ఇలాంటివి ఎప్పటికైనా తమ మెడకు చుట్టుకుంటుందని తప్పించుకుంటున్నారట. ఇటు స్ధానికులు, ధార్మిక సంఘాలు కొండను రక్షించుకుంటామని అంటున్నారు.

విశాఖ జిల్లాలో జాతీయ రహదారికి అతిచేరువలో ఉన్న తర్లువాడ భూములకు బాగా డిమాండ్‌ ఉంది. ఇక్కడ ఎకరా రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు మార్కెట్‌ లో ధర పలుకుతోంది. తర్లువాడ కొండపై నుంచి వ్యూ చాలా అందంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇక్కడి భూముల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.ఇది గుర్తించిన విజయసాయిరెడ్డి.. తన కుటుంబానికి చెందిన సంస్థలకు అక్కడ నామమాత్రపు ధరకు భూములు కేటాయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటుకు వంద ఎకరాలకు ఎసరు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ వంద ఎకరాలు కొనాలంటే దాదాపు 300 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అయితే వైసీపీలో నెంబర్‌2గా ఉన్న వ్యక్తి కావడంతో నామ మాత్రపు ధరతో భూములు కేటాయించేందుకు ప్రయత్నాలు చకచకా జరిగిపోతున్నాయని,ఉన్నతస్థాయిలో ఆదేశాలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది.

ఇక ఆనందపురం-పెందుర్తి జాతీయ రహదారికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తర్లువాడ కొండపై ఎక్కువ విస్తీర్ణం ఉండడంతో అక్కడ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తామని ప్రతిపాదించి, ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి లాబీయింగ్‌ చేశారని సమాచారం. దాదాపు వంద ఎకరాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, ఫైలు చకచకా ముందుకు సాగింది. ఈనెల ఐదో తేదీన విజయసాయిరెడ్డి అతి ముఖ్యమైన ఇద్దరు, ముగ్గురితో కలిసి తర్లువాడ గ్రామానికి ఆనుకుని ఉన్న భూములను కొండ పైనుంచి సందర్శించారు కూడా. అయితే స్థానిక రెవెన్యూ అధికారులను కాకుండా ఆయన కేవలం గ్రామ సర్వేయర్‌ను మాత్రమే తన వెంట తీసుకువెళ్లారు.

తర్లువాడ కొండ పరిశీలనకు విజయసాయిరెడ్డి సర్వేయర్‌ తప్ప..ఆనందపురం తహసీల్దారు, బీమిలి ఎమ్మెల్యే కానీ,చివరకు వైసీపీకి చెందిన తర్లువాడ సర్పంచ్‌ను కూడా తీసుకువెళ్లలేదు.ప్రభుత్వ భూములు పరిశీలించాలంటే కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు వెళ్లాలి.ఇక ఏదైనా కంపెనీక,సంస్థకు భూమి కేటాయించాలనుకుంటే మొదట మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో కలెక్టర్‌ వరకు ఫైలు సాగాలి.ప్రాంతం,భూమిప్రాధానాన్ని బట్టి నిర్ణీత ధరను కలెక్టర్‌ నిర్ణయించి ప్రభుత్వానికి సిఫారసు చేయాలి.ఆ తరువాత ఉన్నత స్థాయిలో చర్చించి కేబినెట్‌ ఆమోదం పొందితే రేటు ఖరారు చేస్తారు. అయితే ఈ తతంగమేదీ లేకుండా అధికార పార్టీ ఎంపీ ఒక్కరే గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ కొండను పరిశీలించడం రెవెన్యూ నిబంధనలు ఉల్లంఘించడమేనని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండడంతో అధికార పార్టీ నేత కొండను సందర్శించి కొన్ని మ్యాపులు పరిశీలించినా జిల్లా,మండల అధికారులు సైలెంట్‌గా ఉండిపోయారని స్థానికులు విమర్శిస్తున్నారు.

మరోవైపు తర్లువాడలో సర్వేనంబరు1లో ఖాళీగా ఉన్న భూముల్లో దాదాపు 65 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటుకు జిల్లా యంత్రాంగంప్రతిపాదించింది.ఆనందపురంలో లాజిస్టిక్‌ పార్కు నెలకొల్పడానికి నిర్ణయించిన ప్రభుత్వం...భూమి సేకరించాలని ఇటీవల జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆనందపురం తహసీల్దారు తర్లువాడలో సర్వేనంబరు-1లో 65 ఎకరాలను గుర్తించి ప్రతిపాదించగా, జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి పంపారు.

ఇక తర్లుకొండ ప్రసిద్ధ ప్రాంతంగా ఇక్కడి ప్రజలు చెపుతున్నారు.విష్ణుపాదాలు,దేవాలయం ఉన్నాయి. అక్కడ విగ్రహాలను కూడా గుర్తించారు గ్రామస్తులు.వరాహ నృసింహ స్వామి మొదట ఇక్కడే వెలసి..ఆ తర్వాత అడవివరం కొండపైకి వెళ్లినట్లు ఇక్కడ ప్రజల నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని తర్లువాడగా నామకరణం చేసినట్లు స్థానికులు అంటుంటారు.కొండపై 120 అడుగుల విగ్రహ ప్రతిష్టకు స్థానికుల ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కొండపై 10 ఎకరాల స్థలం చదును కూడా చేశారు గ్రామస్తులు.ఇంతటి చారిత్రాత్మక నేపధ్యం ఉన్న ఈ విలువైన భూమిని విజయసాయిరెడ్డికి కట్టబెట్టతుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story