ఏపీలో జీతాలు లేక రోడ్డున పడ్డ గ్రామ వాలంటీర్లు

ఏపీలో జీతాలు లేక రోడ్డున పడ్డ గ్రామ వాలంటీర్లు
గ్రామ వాలంటీర్లు.. టవర్‌ ఎక్కి నిరసన చేపట్టారు.

జీతాలు లేక ఏపీలో గ్రామ వాలంటీర్లు రోడ్డున పడ్డారు.. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం పరిధిలోని 96 మంది గ్రామ వాలంటీర్లు.. టవర్‌ ఎక్కి నిరసన చేపట్టారు. సెకెండ్‌ ఫేజ్‌లో నియమించిన 96 మంది వాలంటీర్లకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు. గత పది నెలలుగా విధులు నిర్వహిస్తున్నా గౌరవ వేతనం గాని.. సి.ఎఫ్‌.ఎం.ఎస్‌.ఐ.డి గానీ ఇప్పటి వరకు సమకూర్చకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో నిరసన బాట పట్టారు.. జగ్గం పేటలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కారు.

ఘటనా స్థలానికి చేరుకున్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్‌ బాబు.. వాలంటీర్లతో చర్చలు జరిపి కిందకు దింపారు. ఇప్పటి వరకు 15 సార్లు పై అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకపోయిందని అందుకే ఇలా ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story