VINAYAKA: రూ. 2 కోట్లు పలికిన గణేష్ లడ్డూ

తెలుగు రాష్ట్రాల్లో నిమజ్జనానికి ముందు లడ్డూ వేలం వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోహైదరాబాద్లోని బండ్లగూడ కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో జరిగిన వేలంపాట గత రికార్డులను బ్రేక్ చేసింది. ఎవరూ ఊహించలేని రీతిలో ఏకంగా రూ. 2 కోట్ల 31 లక్షల 95 వేలు పలికింది. ఈ భారీ మొత్తాన్ని వెచ్చించి భక్తులు లడ్డూను దక్కించుకున్నారు. దీంతో గతేడాది నమోదైన రూ. 1.87 కోట్ల రికార్డు బ్రేక్ అయ్యింది.
బాలాపూర్ లడ్డూ వేలంపాట ప్రారంభం
గణేశ చతుర్థి ఉత్సవాల్లో అత్యంత ఆసక్తికరమైన సంఘటనలలో హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ఒకటి. ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ భారీ ధరను దక్కించుకుంటుందన్న ఊహాగానాలు ఉన్నాయి. బాలాపూర్ లడ్డూ వేలంపాట ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తం 38 మంది వేలంపాట పాడుతున్నారు. గతేడాది సెప్టెంబర్ 17న జరిగిన వేలంలో బాలాపూర్ గణేశ్ లడ్డూ రూ.30.01 లక్షలకు రికార్డు స్థాయిలో వేలం వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com