11 March 2021 11:16 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / వైజాగ్‌లో కేటీఆర్‌...

వైజాగ్‌లో కేటీఆర్‌ చిత్ర పటానికి స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితుల పాలాభిషేకం

ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చిత్ర పటానికి స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితులు పాలాభిషేకం చేశారు.

వైజాగ్‌లో కేటీఆర్‌ చిత్ర పటానికి స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితుల పాలాభిషేకం
X

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరులో సమ్మె సైరన్‌ మోగింది. 28 రోజులుగా నిరసనలు, దీక్షలు చేపడతున్న కార్మికులు, ఉద్యోగులు... కీలక అస్త్రం ప్రయోగించారు. యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు. యాజమాన్యంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా మార్చి 25 నుంచి విధుల బహిష్కరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి... రెండు వారాల ముందుగా నోటీసు ఇచ్చారు. నిబంధనల మేరకు పదిరోజుల ముందు సమ్మె నోటీసు ఇవ్వాలి. అందుకే రెండువారాల ముందుగానే నోటీసు ఇచ్చారు కార్మికులు. యాజమాన్యం నుంచి సరైన స్పందన రాకపోతే.. ఎప్పుడైనా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు కార్మికులు.

మరోవైపు... స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళనల్ని కొనసాగుతున్నాయి. ప్లాంట్‌ను వంద శాతం ప్రైవేటీకరిస్తామన్న కేంద్రం ప్రకటనతో అగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. 28 రోజులుగా ఆందోళనలతో విశాఖ వీధులు హోరెత్తుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌ ప్రధాన ద్వారం వద్ద దీక్షలు కొనసాగుతున్నాయి. కూర్మన్నపాలెం స్థూపం వద్ద దీక్షలు 28వ రోజుకు చేరాయి. ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చిత్ర పటానికి స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితులు పాలాభిషేకం చేశారు. ఉద్యమంలో కలిసి పని చేస్తానని అన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

Next Story