Visakha Steel Plant:విశాఖ ఉక్కు అమ్మేస్తున్నాం... సహకరించండి

Visakha Steel Plant:
Visakha Steel Plant: విశాఖ స్టీల్ సంస్థ RINLలో 100శాతం పెట్టుబడి ఉపసంహరణ ఉంటుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంటులో విశాఖ, అరకు ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె విశాఖ స్టీల్ విషయంలో లిఖిత పూర్వక సమాధానంతో మరింత స్పష్టత ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విషయంలో విధాన పర నిర్ణయం తీసుకోవడం జరిగిందని.. జనవరి 27నే కేబినెట్ ఎకనమిక్ ఎపైర్స్ కమిటీ అమోదించిందని అందులో పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాష్ట్రానికి ఎలాంటి ఈక్విటీ షేర్ లేదని.. వందశాతం కేంద్రానికే ఉందని.. దీనిని ఉపసంహరించుకున్నట్టు తెలిపారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కంపెనీ తెలిపింది. భాగస్వాములు, ఉద్యోగులు షేర్లు కొనుగోలు చేసేలా ప్రత్యేక ప్రతిపాదనలు ఉంటాయన్నారు. పలు విషయాల్లో అవసరమైన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అవసరం అయితే కోరుతున్నామని తెలిపారు. ప్రైవేటీకరణ ద్వారా ఉత్పాదకత పెరిగి.. అవకాశాలు పెరుగుతాయంటున్నారు ఆర్థికమంత్రి
కంపెనీ వాల్యూపై ...
డిసెంబర్ 2020 నాటికి కంపెనీ నెట్ వర్త్ 32022 కోట్లుగా ప్రకటించింది కేంద్రం. అప్పులు 21236 కోట్లు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం పెట్టిన పెట్టుబడి 4889.85 కోట్లు. అప్పుల కారణంగా నాలుగేళ్లుగా కంపెనీ వాల్యూ తగ్గుతు వచ్చినట్టు చెబుతున్న ఆర్థిక శాఖ. అయితే భూములకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com