పోలీసుల మానవత్వం... అనాధ శవాన్ని భుజాలపై మోసి.. !

పోలీసుల మానవత్వం... అనాధ శవాన్ని భుజాలపై మోసి.. !
ఈ మధ్య యువ పోలీసులు మానవత్వం చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా విశాఖలో ఓ అనాధ శవాన్ని భుజాల పైన దాదాపు 3కిమీ మోసి తీసుకువెళ్ళారు

ఈ మధ్య యువ పోలీసులు మానవత్వం చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా విశాఖలో ఓ అనాధ శవాన్ని భుజాల పైన దాదాపు 3కిమీ మోసి తీసుకువెళ్ళారు ఎస్‌ఐ అరుణ్‌కిరణ్‌.. సీతపాలెం తీరానికి శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది. ఎస్‌ఐ అరుణ్‌కిరణ్‌ కేసు నమోదు చేసి పలు పోలీస్‌ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. అయితే మృతదేహం కోసం ఎవరూ కూడా రాకపోవడంతో మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది.

దీనితో మృతదేహం తరలింపుకి ముందుకు రాకపోవడంతో ఎస్‌ఐ వి.అరుణ్‌కిరణ్‌ స్పందించి ఏఎస్‌ఐ దొర, హెచ్‌సీ మసేను, కానిస్టేబుల్‌ నర్సింగరావు, హోంగార్డు కొండబాబు కర్రల సాయంతో తీరం నుంచి మృతదేహాన్ని సీతపాలేనికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి యలమంచిలిలోని మార్చురీకి తరలించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఎస్‌ఐ అరుణ్‌కిరణ్‌ ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story