విశాఖ కిడ్నాప్ కథ సుఖాంతం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విశాఖ కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. 17 బృందాలతో చేధించిన పోలీసులు కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల్లోనే కిడ్నాపర్లను పట్టుకున్నారు. ఎంపీ కుటుంబసభ్యులు సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నామని, ఎంపీ కుటుంబసభ్యులతోపాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు కూడా సేఫ్‌గా ఉన్నారని పోలీసులు తెలిపారు.
విశాఖలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ సతీమణితో పాటు కుమారుడు, ఆడిటర్‌లను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ కలకలం రేపింది. రుషికొండలోని ఎంపీ నివాసం నుంచి వారిని కిడ్నాప్ చేశారు. మొదట ఎంపీ కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం ఆ తర్వాత ఎంపీ సతీమణి జ్యోతిని కూడా బంధించి ఆమె ద్వారా మాట్లాడేందుకు ఆడిటర్ జీవీని ఇంటికి పిలిపించి ఆయన్ను కూడా కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై రౌడీషీటర్ హేమంత్ అనే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేసి 17 బృందాలతో చేధించారు పోలీసులు కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల్లోనే కిడ్నాపర్లను పట్టుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com