ప్రభుత్వం ఇలా చేసివుంటే శ్రీకాంత్ ఘటన జరిగేదా? : తెలుగు మహిళా అధ్యక్షురాలు

ప్రభుత్వం ఇలా చేసివుంటే శ్రీకాంత్ ఘటన జరిగేదా? : తెలుగు మహిళా అధ్యక్షురాలు
ప్రభుత్వం ఇలా చేసివుంటే శ్రీకాంత్ ఘటన జరిగేదా? : తెలుగు మహిళా అధ్యక్షురాలు

విశాఖలో దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసులో పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1 నిందితురాలిగా నూతన్‌ నాయుడు భార్య మధు ప్రియను చేర్చారు. సహాయకురాలు వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు బాధితుడి వీడియో వాంగ్మూలం రికార్డు చేశారు. బాధ్యులు ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సినీ నిర్మాత నూతన్‌ నాయుడు ఇంట్లో జరిగిన ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ దృశ్యాలు కలకలం రేపుతున్నాయి..

దళిత సంఘాల ఒత్తిడి మేరకు బాధితుడు శ్రీకాంత్‌ను పోలీసులు స్టేషన్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ తన ఆవేదనను వెల్లడించారు. ఇంట్లో పని మానేశానన్న కోపంతోనే గుండు గీయించారని తెలిపాడు. ఎవరికయినా చెబితే ప్రతాపం చూపిస్తామంటూ బెదిరించారని వాపోయాడు.

మరోవైపు ఈ కేసును విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురు నిందితులు ఉన్నట్లు తేల్చామన్నారు. మెడికోలీగల్ కేసు కింద పరీక్షలు చేయించినట్లు సీపీ తెలిపారు. అంతేకాదు శ్రీకాంత్ కేసులో అన్ని ఆధారాలు సేకరించామన్నారు. కత్తిరించిన జుట్టు కూడా ఘటనా స్థలంలో లభించినట్లు చెప్పారు. శ్రీకాంత్‌పై పలుమార్లు దుర్భాషలాడి శిరోముండనం చేయించారని సీపీ మనీష్ కుమార్ తెలిపారు.

దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వం ఇలా చేసివుంటే శ్రీకాంత్ ఘటన జరిగేదా? : తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరోపించారు. వరప్రసాద్ శిరోముండనం కేసులో కఠిన చర్యలు తీసుకునివుంటే... ఇప్పుడు శ్రీకాంత్ ఘటన జరిగేది కాదన్నారు. వరప్రసాద్ కేసులో సరైన న్యాయం జరుగలేదని అనిత మండిపడ్డారు. విశాఖ పెందుర్తి సుజాతనగర్‌లో దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనంపై దళిత సంఘాలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. యువకుడిని చిత్రహింసలు పెట్టిన సినీ నిర్మాత నూతన్‌ నాయుడు, అతని భార్యపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత నేతలు డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story