Vishakapatnam: రైతుల నిరశన

Vishakapatnam: రైతుల నిరశన
విశాఖ జిల్లా పద్మనాభం మండలం గంధవరంలో జగన్ లే అవుట్‌ వద్ద రైతుల ఆందోళన; ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో 100 ఎకరాల సమీకరణ; మూడేళ్లుగా పరిహారం ఇవ్వకపోవడంతో ఆందోళన....


విశాఖ జిల్లా పద్మనాభం మండలం గంధవరం రెవెన్యూ పరిధిలో జగనన్న లే అవుట్‌ వద్ద రైతులు ఆందోళనకు దిగారు.. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో 100 ఎకరాలు భూములు తీసుకుని మూడేళ్లు గడుస్తున్నా పరిహారం ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.. తీసుకున్న భూములకు పరిహారంగా ఎక్కడ స్థలాలు ఇస్తున్నారో ఇప్పటికీ చెప్పకపోవడంపై తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.. డి-పట్టా రైతులకు పరిహారంగా ఇవ్వాల్సిన స్థలాలపై కోత పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు.. ఇది వరకు తోట పంటలతో జీవనోపాధి పొందిన తమకు ఆ ఆధారం కూడా లేకుండా చేసి అన్యాయం చేశారని ఆందోళనకు గురవుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story