Vishakapatnam: తాగి తూలారు... చివరకు చీపుర్లు పట్టి...

Vishakapatnam: తాగి తూలారు... చివరకు చీపుర్లు పట్టి...
డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులకు సమాజ సేవే శిక్ష; విశాఖలో విన్నూత్న ప్రయోగం; చీపుర్లు పట్టి బీచ్ ను బాగుచేయిస్తున్న వైనం

విశాఖ బీచ్ తళతళమని మెరిసిపోయేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే ఒక్కరు కాదు ఇద్దురు కాదు, ఏకంగా పదుల సంఖ్యలో కొంత మంది అబ్బాయిలు చీపుర్లు పట్టి బీచ్ ను శుభ్రపరిచేందుకు నడుంబిగించారు. విశాఖ వాసుల్లో ప్రకృతి పట్ల శ్రద్ధ పెరిగిందేమో అనిపిస్తోంది కదూ. కానీ, ముచ్చట వెనుక అసలు మ్యాటర్ వేరే ఉంది. బీచ్ లో బుద్ధిగా, శ్రద్ధగా పనిలో నిమగ్నమైన వీరి వెనుక న్యాయస్థానం అదేశాలు ఉన్నాయి. అందుకే పోలీసుల పర్యవేక్షణలో ఇలా చకచకా పనులు సాగుతున్నాయి. ఇదేదో పెద్ద శిక్షలానే ఉందే అన్న అనుమానం వస్తోంది కదూ...! అదీ నిజమే.... ఎందుకంటే ఈ ప్రబుద్దులందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారే. అయితే ఇలా తరచు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతున్న వీరికి కౌన్సిలింగ్ ఇస్తే సరిపోదని భావించిన స్థానిక కోర్టు, సమాజిక సేవను శిక్షగా విధించింది. సుమారు 52మందికి బీచ్ ను శుభ్రపరిచే శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు వీరిని ఆర్కే బీచ్ లో వివిధ ప్రదేశాలకు తరలించారు. ఇక శిక్ష పడిన వారిలో కాలేజీ విద్యార్ధుల దగ్గర నుంచి ఉద్యోగస్థులు, ఆటోడ్రైవర్లు కూడా ఉండటం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story