విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వ‌ద్ద జ‌నం ప‌డిగాపులు

విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వ‌ద్ద జ‌నం ప‌డిగాపులు
నిన్న మధ్యాహ్నం నుంచి సర్వర్లు మొరాయిస్తున్నాయి

విశాఖ మధురవాడ సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి సర్వర్లు మొరాయిస్తున్నాయి. రిజిస్ట్రేషన్లతో పాటు ఈసీ, ఇతరత్రా ఆన్‌లైన్‌కు సంబంధించిన సేవలన్నీ బంద్ అయ్యాయి.

రాష్ట్రమంతటా సర్వర్లపై ఒత్తిడి కారణంగా మధురవాడలో కూడా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని సబ్‌ రిజిస్ట్రార్ చెబుతున్నారు. నిన్నటి నుంచి 40 నుంచి 50 రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని... ఎప్పటికప్పుడు పై అధికారులతో మాట్లాడుతున్నట్లు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story