సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విష్ణుకుమార్‌ రాజు

సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విష్ణుకుమార్‌ రాజు
X

ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ రాజు. జగన్‌ను ఉత్తర కొరియా నియంత కిమ్‌తో పోల్చారు. సీఎంకు ప్రజల కష్టాలు తెలియడం లేదంటూ మండిపడ్డారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని జగన్ చెప్పారని.. కానీ సీఎం కూడా మారిపోవచ్చని అన్నారు. ఉపముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే.. ఏపీకి తొలి మహిళా సీఎంను కూడా నియమించి జగన్ చరిత్ర సృష్టించాలన్నారు. అటు స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు విష్ణుకుమార్‌ రాజు. అక్రమాలు జరిగినందున ఏకగ్రీవాలను రద్దు చేయాలని అన్నారు.


Tags

Next Story