VIVEKA CASE: ఇవాళ సీబీఐ ముందుకు భాస్కర్‌రెడ్డి

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని విచారించిన అధికారులు.. కేసు సంబంధించిన కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ(సోమవారం) సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి రానున్నారు. ఇప్పటికే భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ కడపలో విచారణకు రావాలని ఆయనకు సూచించారు. ఈనెల 12న విచారణకు హాజరుకావాలని గతంలో కోరిన సీబీఐ అధికారులు.. తాజాగా ఇవాళే రావాలని చెప్పారు.
మరోవైపు ఎంపీ అవినాష్‌రెడ్డి సైతం ఇవాళ విచారణకు రావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో తెలిపారు. పులివెందులలోని ఎంపీ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. అయితే నేడు విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డి తెలిపారు. కార్యకర్తల సమావేశం ఉన్నందున విచారణకు రాలేనంటూ లేఖలో పేర్కొన్నారు. పులివెందులలో సమావేశం ఉన్నందున హైదరాబాద్‌లో విచారణకు రాలేనని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఇప్పటికే రెండుసార్లు సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డిని విచారించారు. జవవరి 28, ఫిబ్రవరి 24న విచారించిన అధికారులు.. వివేకా హత్యకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com