Viveka Murder: భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌రెడ్డిలకు సీబీఐ ఫినిషింగ్ టచ్‌

Viveka Murder: భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌రెడ్డిలకు సీబీఐ ఫినిషింగ్ టచ్‌
ఇద్దరినీ చంచల్‌గూడ జైలు నుంచి ఆరో రోజు కస్టడీకి తీసుకున్నారు

వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిల కస్టడి నేటితో ముగియనుంది. ఇప్పటికే ఐదు రోజులు సుదీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ.. ఇవాళ విచారణలో ఫినిషింగ్ టచ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరినీ చంచల్‌గూడ జైలు నుంచి ఆరో రోజు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ గడువు ముగిసిన తర్వాత తిరిగి ఇద్దరినీ జైలుకు తరలించనున్నారు.

ఐదు రోజుల పాటు జరిగిన విచారణలో సీబీఐ అధికారులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య రోజు జరిగిన పరిణామాలపై అధికారులు ఆరా తీశారు. సాక్ష్యాలు తారుమారు, ఎవిడెన్స్ ట్యాంపరింగ్‌లపై సీబీఐ ప్రశ్నించింది. రూ.40కోట్ల డీల్ వ్యవహారంపైనా కూపీ లాగిన అధికారులు.. అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు.

Tags

Next Story