Viveka Murder: మే 5 లోపు ఎర్ర గంగిరెడ్డి లొంగిపోవాలి లేదంటే..

Viveka Murder: మే 5 లోపు ఎర్ర గంగిరెడ్డి లొంగిపోవాలి లేదంటే..
A1 ఎర్ర గంగిరెడ్డికి ఏపీ హైకోర్ట్ ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది

వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 ఎర్ర గంగిరెడ్డికి ఏపీ హైకోర్ట్ ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5 వరకు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ గంగి రెడ్డి లొంగిపోకపోతే సీబీఐ అరెస్ట్ చేసుకోవచ్చని తెలిపింది హైకోర్టు. మరోవైపు వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి ప్రధాన నిందితుడు. వివేక హత్యలో ప్రధాన పాత్ర పోషించింది గంగి రెడ్డేనని… ప్రధాన నిందితుడిగా ఉండి బయట ఉండటంతో.. సాక్షులు ముందుకు వచ్చేందుకు భయపడుతున్నారని సీబీఐ తరపు లాయర్ వాదించారు. గంగిరెడ్డి బయట ఉండటం అంత మంచిది కాదని.. హత్య చేయడమే కాదు, నేరం కప్పిపుచ్చేందుకు ఆధారాలు కూడా చేరిపేశారన్నారు. ఏపీ హైకోర్ట్ ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. జూన్‌ 30 వరకు గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేసింది. రెండు నెలల వ్యవధిలోనే గంగిరెడ్డిపై విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది.

వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి 2019 మార్చి 28న అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో సిట్ గంగిరెడ్డిని.. నార్కో అనాలసిస్ చేసిందని కానీ.. వివరాలు మాత్రం ఇవ్వలేదన్నారు గంగిరెడ్డి తరపు లాయర్. ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థల ముందు గంగి రెడ్డి 72 సార్లు హాజరయ్యారని తెలిపారు. కొత్తగా గంగిరెడ్డిని విచారించాల్సింది ఏమి లేదని గంగిరెడ్డి తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. అయితే గంగిరెడ్డి లాంటి నిందితుడు బయట ఉంటే సమాజానికి తప్పుడు సంకేతం వెళ్తుందని.. అత్యంత ప్రభావితం చేసే వ్యక్తి గంగిరెడ్డి అంటూ సునీత తరపు లాయర్‌ వాదించారు. హత్య చేసిన వ్యక్తి బయట తిరుగుతుంటే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story