Viveka Murder Case : రెండు గంటలుగా అవినాష్ రెడ్డి విచారణ

X
By - Vijayanand |24 Feb 2023 4:09 PM IST
ఎస్పీ రామ్ సింగ్ బృందం అవినాష్‌రెడ్డిని విచారణ చేస్తోంది. తనను న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని అవినాష్ కోరారు.
వివేకా హత్య కేసులో రెండుగంటలుగా ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఎస్పీ రామ్ సింగ్ బృందం అవినాష్‌రెడ్డిని విచారణ చేస్తోంది. తనను న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని అవినాష్ కోరారు. విచారణ సమయంలో న్యాయవాదులకు అనుమతి లేదని సీబీఐ స్పష్టం చేసింది. బ్యాంకు లావాదేవీలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
దస్తగిరి స్టేట్‌మెంట్‌ను ప్రస్తావిస్తూ అవినాష్‌ను విచారిస్తున్నట్లు సమాచారం. అయితే తనకేమీ తెలియదంటూ అవినాష్ రెడ్డి చెప్పినట్లు టాక్ వినబడుతోంది. దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డితోపాటు ఉన్న కాల్ లిస్ట్, నిందితుల టవర్ లొకేషన్లపై కూడా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా విచారణ జరిగినప్పుడు న్యాయవాదులను అనుమతించలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com