Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డి ఎక్కడ?

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ఆయన పులివెందులలో కన్పించలేదు. అవినాష్ హైదరాబాద్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగినా.. అక్కడా లేరు. మరి అవినాష్ రెడ్డి ఎక్కడ ఉన్నట్లు? పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత.. అందరి ఫోకస్ అవినాష్ రెడ్డిపై పడింది. తండ్రి అరెస్ట్ తర్వాత కూడా అవినాష్ రెడ్డి బయటకు ఎందుకు రాలేదన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఐతే.. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిపై సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. అవినాష్ కీలక పాత్ర పోషించినట్లు భావిస్తోంది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగు సార్లు విచారించింది. విచారణ నిలిపివేయాలంటూ కూడా అవినాష్ కోర్టుకు వెళ్లారు. అంతా రాజకీయ కుట్రగా గతంలో కొట్టిపారేసిన అవినాష్ రెడ్డికి… సీబీఐ దూకుడుతో మరింత ఉచ్చు బిగుస్తోంది. సీబీఐ తదుపరి టార్గెట్ అవినాష్ రెడ్డే అనే ప్రచారం బలంగా సాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com