viveka murder case: అయోమయంలో సీఎం జగన్

వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు దూకుడుగా అరెస్టులు చేస్తూండటం సీఎం జగన్ పర్యటనలపై ప్రభావం చూపుతుంది. ఇవాళ అనంతపురం జిల్లా శింగనమల వెళ్లి వసతి దీవెన బటనొక్కాల్సి ఉంది. కానీ వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత షెడ్యూల్ మారిపోయింది. టూర్ క్యాన్సిల్ అయిందని ప్రకటించారు.
దీనికి అనివార్య కారణాలు అని చెప్పారు. బహిరంగ సభల్లో మాట్లాడాల్సి వచ్చినా ఏం చెప్పాలో.. ఎలా మేనేజ్ చేయాలో జగన్ దగ్గర సమాధానం లేదట. ఇన్ని రోజులు అలా చెప్పిన తాను.. ఇప్పుడు ఏంచెప్పాలో దిక్కుతోచట్లేదట. జగన్‌కు మద్దతుగా వైసీపీ నుంచి పెద్దగా రియాక్షన్స్ రాలేదు. దీంతో జగన్ కు ఏం చేయాలో ఆర్ధం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
వివేకా హత్యకేసులో పార్టీకి గానీ.. సోదరుడు అవినాష్‌కు.. ఇందులో ఇంటి వారికి ఎలాంటి సంబంధమేలేదని ఇన్ని రోజులు వైఎస్ జగన్ చెప్పుకుంటూ వచ్చారు. అవినాష్ రెడ్డిని సీబీఐ రెండు సార్లు విచారణకు పిలిచే సరికి ఇక అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో ఆయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ సుప్రీంకోర్టు విచారణ అధికారిని మార్చాలని ఆదేశించడంతో ఆయన రిలాక్స్ అయ్యారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. దీనికి కారణం ఇక తనకు ముప్పు ఉండదని అనుకోవడమే అంటున్నారు. రెండు వారాల పాటు కొనసాగింది. కానీ తర్వాత ఫేట్ మారిపోయింది. వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఊహించని విధంగా సీబీఐ వేగంగా అడుగులు వేస్తోంది. కొత్త దర్యాప్తు బృందం ఇంత వేగంగా స్పందిస్తుందని వైఎస్ ఫ్యామిలీ అనుకోలేకపోయింది.
మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఏం చేస్తారో.. అని వైసీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయట. అయితే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈ కొద్దిరోజులు జగన్ అస్సలే బయటికి రారన్న టాక్ నడుస్తోంది. మరోవైపు జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తరన్న వార్త కూడా చక్కర్లు కొడుతోంది ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలు, అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో జగన్ నెక్ట్స్ స్టెప్ ఏంటనేది ఆసక్తిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com