Viveka Murder Case : మూడవ రోజు అవినాష్ రెడ్డిని ప్రశ్నించనున్న సీబీఐ

వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇవాళ మూడో రోజు ప్రశ్నించనున్నారు. ఆయనతో పాటు వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను సైతం సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ ముగ్గురుని గురువారం సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.. 10.30కు విచారణకు వెళ్లిన అవినాష్ రెడ్డి.. సాయంత్రం ఆరున్నరకు బయటికొచ్చారు.. 8 గంటలపాటు అనేక కోణాల్లో ప్రశ్నించారు.. అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌పై రెండోరోజు కస్టడీలో సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది.. తొలిరోజు ఐదు గంటలపాటు విచారించగా.. రెండోరోజు ఆరుగంటలపాటు ప్రశ్నించారు. ఉదయ్ కుమార్, భాస్కర్ రెడ్డిని కలిపి విచారించగా.. గతంలో అరెస్టయిన నిందితులు, సాక్ష్యుల వాంగ్మూలాలను ముందు ఉంచి ప్రశ్నలు అడిగారు. సుపారీ ఆఫర్ చేసింది ఎవరు.. అలాగే శివశంకర్ రెడ్డితో భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి లావాదేవీలపైనా ఆరా తీశారు. అటు అవినాష్‌పైనా సుపారీపైనే ప్రశ్నలు అడిగారు.. సీబీఐ అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు తండ్రీ కొడుకులు సమాధానాలు దాటవేసినట్లుగా సమాచారం.. న్యాయవాదుల సమక్షంలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ను ప్రశ్నించిన సీబీఐ.. తర్వాత తిరిగి వారిని చంచల్‌గూడ జైలుకు పంపించింది. ఇవాళ కూడా ఈ ముగ్గురిపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు సీబీఐ అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com