Vizag: చెత్తపన్నుపై విశాఖ వాసుల ఆగ్రహం

Vizag: చెత్తపన్నుపై విశాఖ వాసుల ఆగ్రహం
చెత్త తరలించకపోవడంతో రోడ్లపైకి వస్తున్న ప్రజలు

చెత్తపన్ను వసూళ్లపై జగన్‌ సర్కార్‌ మొండిగా వ్యవహరిస్తోందని విశాఖ వాసులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ఏ మాత్రం శ్రద్ధ లేకుండా తన పంతాన్ని పదర్శిస్తోందని ఆగ్రహానికి గురౌతున్నారు. ఇళ్ల నుంచి చెత్తను తరలించకుండా ప్రభుత్వం ఆపేస్తుందని విమర్శిస్తున్నారు. విశాఖ కార్పొరేషన్‌ పరిధిలో చెత్త తరలించకపోవడంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.2022 జనవరి నుంచి చెత్త పన్ను బ్యాక్‌లాగ్‌ చూపించి చెత్త తరలింపును నిలిపివేశారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.ఆస్థిపన్నులోనే చెత్త పన్ను ఉన్నా అదనంగా చెత్త పన్నును వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

Tags

Next Story