MILAN 2024: మిలాన్ 2024కు సర్వం సిద్ధం

విశాఖ తీరంలో మిలన్ 2024 విన్యాసాల సందడి మొదలైంది. దాదాపు 50 దేశాలు పాల్గొంటుండగా...ఇప్పటికే వివిధ దేశాల నేవీ బృందాలు సాగర నగరానికి చేరుకున్నాయి. వివిధ దేశాల యుద్ధ నౌకలు, హెలీకాప్టర్లు, విమానాలు...విన్యాసాలకు రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. ఈనెల 22న జరగనున్న సిటీ పరేడ్ నగరవాసులకు కనువిందు చేయనుంది.
విశాఖలో జరిగే మిలన్ 2024 నౌకాదళ విన్యాసాల్లో వివిధ దేశాల ప్రతినిధులు నగరానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే కొందరు వచ్చేశారు. తొలిదశ హార్బర్ దశ 19నుంచి 23 వరకు, సముద్రపు దశ 24నుంచి 27 వరకు నిర్వహిస్తున్నారు. 22న మిలన్ 2024 సిటీ పరేడ్‌లో వివిధ దేశాల నౌకాదళ బృందాలు పాల్గొంటున్నాయి. గత రెండు రోజులుగా ఆర్కే బీచ్‌లో రిహార్సల్స్‌ను పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షిస్తున్నారు. విశాఖ చేరుకున్న భారత్ నౌకాదళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ కారియర్లు ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విరాట్ ఈరెండు యుద్ధ నౌకలు మిలన్ 2024లో ప్రధాన అకర్షణగా ఉన్నాయి. వీటితోపాటుగా దాదాపు 20 యుద్ధ నౌకలు, MIG 29K మరియు P8I సహా దాదాపు 50 విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొని తమ పాటవాన్ని ప్రదర్శిస్తాయి. విన్యాసాలు గగన తలంలో చూపరులకు గగుర్పాటు కలిగించేలా సాగనున్నాయి.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిర్ క్రాప్టు కారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య,హిందూ మహాసముద్రంలో దేశ సముద్ర రక్షణ, పవర్ ప్రొజెక్షన్ సామర్థ్యాలు, పోరాటపటిమకు నిదర్శనమైన విక్రమాదిత్య విన్యాసాల్లో పాల్గొంటాయి.వీటితో పాటు ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్ విక్రాంత్...వివిధ దేశాల నౌకలు దాదాపు పదివరకు ఇప్పటికే విశాఖ తీరానికి చేరాయి.మిలన్ నిర్వహించడం ఇది 12 వసారి. సముద్ర దశలో, పాల్గొనే నౌకాదళాలు అధునాతన ఎయిర్ డిఫెన్స్, యాంటీ సబ్‌మెరైన్ ,యాంటీ సర్ఫేస్ వార్‌ఫేర్ డ్రిల్‌లను నిర్వహిస్తాయి. వైమానిక, ఉపరితల లక్ష్యాలపై గన్నేరీ షూట్‌లు, విన్యాసాలు కొనసాగుతాయి. సముద్రాలపై భద్రతను పెంపొందించడానికి, అందరి వృద్ధి శ్రేయస్సు కోసం సముద్ర వాణిజ్య భద్రతను నిర్ధారించడానికి ఆలోచనలను పంచుకోవడానికి పాల్గొనే నావికాదళాలకు మిలాన్ ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com