Vizag-Rushikonda: శరవేగంగా రిషికొండ నిర్మాణ పనులు

Vizag-Rushikonda: శరవేగంగా రిషికొండ నిర్మాణ పనులు
పూర్తి అయిన వెంటనే విశాఖ నుంచి పాలన కొనసాగించనున్నట్లు సమాచారం

విశాఖలోని రిషికొండపై నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రీడెవలప్‌మెంట్ హిల్ రిసార్టు నిర్మిస్తున్నారు. నాలుగు బ్లాకుల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ముందుగా ఒక బ్లాకును అందుబాటులోకి తీసుకుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇది పూర్తి అయిన వెంటనే విశాఖ నుంచి పాలన కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు ఆ దిశగా సంకేతాలు ఇచ్చారు. తాజాగా రిషికొండపై నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతో దీనికి మరింత బలం చేకూరుతుంది. ఇక మొత్తం ప్రాజెక్టు నిర్వహణకు ఇటీవలే ఏపీటీడీసీ కన్సల్టెన్సీని ఆహ్వానించింది. తాజాగా వేంగి బ్లాక్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్న కంపెనీలు ఫిబ్రవరి మూడో తేదీలోగా బిడ్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వేంగి, గజపతి, కళింగ, విజయనగరం పేర్లతో మొత్తం నాలుగు బ్లాకులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వేంగి బ్లాకును 3 నెలల్లోగా పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భవన నిర్మాణ తుదిదశ పనులు, విద్యుదీకరణ, నెట్‌వర్కింగ్‌ పనులతో పాటు కొండవాలు రక్షణ పనులు చేపట్టనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story