విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుడు శ్రీనివాస్ ఆచూకీపై వీడని సస్పెన్స్
![విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుడు శ్రీనివాస్ ఆచూకీపై వీడని సస్పెన్స్ విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుడు శ్రీనివాస్ ఆచూకీపై వీడని సస్పెన్స్](https://www.tv5news.in/h-upload/2021/03/21/443314-srinivas.webp)
శనివారం నుంచి అదృశ్యమైన విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుడు శ్రీనివాస్ ఆచూకీపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఆత్మహత్య చేసుకుంటానంటూ లాగ్‌బుక్‌లో రాసి వెళ్లాడు. అప్పటి నుంచి శ్రీనివాస్ కోసం స్టీల్‌ప్లాంట్ పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. శ్రీనివాస్ చెప్పినట్టు బ్లాస్ట్ ఫర్నేస్‌లో పడి ఆత్మహత్య చేసుకోవడం అసాధ్యం అని పోలీసులు చెబుతున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పరితపించేవాడని, తనకు కరోనా వచ్చినప్పుడు కూడా స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాలన్న తపన కనబరిచేవాడని చెబుతున్నారు.
శ్రీనివాస్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మొన్న రాత్రి పది గంటలకు డ్యూటీకి వెళ్లిన శ్రీనివాస్.. స్టీల్‌ప్లాంట్ కోసం చనిపోతున్నట్టు లాగ్‌బుక్‌లో రాశాడు. శ్రీనివాస్ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. తన తండ్రి ఎప్పుడూ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసమే ఆలోచించే వారని కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com