Vizianagaram: బాణసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు..ఒకరు సజీవదహనం

Vizianagaram: బాణసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు..ఒకరు సజీవదహనం
విజయనగరం జిల్లా గుర్ల మండలం గవిడిపేటలో దారుణం జరిగింది. శనివారం రాత్రి బాణసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది

విజయనగరం జిల్లా గుర్ల మండలం గవిడిపేటలో దారుణం జరిగింది. శనివారం రాత్రి బాణసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కంపెనీ వాచ్‌మెన్ సీతంనాయుడు సజీవ దహనమయ్యారు. వాచ్‌మెన్ భార్య సూరమ్మకు తీవ్ర గాయాలు కాగా.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి ఆరు షెడ్లు నేలమట్టమయ్యాయి. షెడ్ల పైకప్పు వంద అడుగుల దూరంలో ఎగిరిపడ్డాయి. కూలీలు లేని సమయంలో పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

Tags

Next Story