Vizianagaram : టీవీ5లో ప్రసారమైన కథనానికి అధికారుల్లో చలనం..

Vizianagaram : విజయనగరం జిల్లాలో చంపానదిని దాటేందుకు శివగామి సాహసం అంటూ టీవీ5లో ప్రసారమైన కథనానికి అధికారుల్లో చలనం వచ్చింది. గజపతినగరం మండలం మర్రివలసలో చంపావతి నదిని దాటేందుకు ఓ యువతి ప్రాణాలకు తెగించింది.
పరీక్ష రాసేందుకు వెళ్లాల్సి ఉండడంతో.. ఉధృతంగా ప్రవహిస్తున్న చంపానదిని దాటేందుకు అత్యంత సాహసం ప్రదర్శించింది. టీవీ-5 కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ ఆదేశాలతో ఐదు కోట్ల రూపాయిలతో వంతెన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. టెండర్లు ఖరారు చేసి మార్చిలోగా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పంచాయతీ రాజ్ అధికారులు తెలిపారు. ఏఐఐబి నిధులు కూడా మంజూరు అయ్యాయని నిర్మాణ సంస్థను ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.
చంపావతి నదిని దాటేందుకు గ్రామస్థులు పడుతున్న అవస్థలపై టీవీ5 ప్రసారం చేసిన వరస కథనాలతో అధికారులు స్పందించడంపై స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com