విశాఖలో ఫ్యూషన్ ఫుడ్స్ ను ఉన్నట్టుండి ఖాళీ చేయించేయించిన VMRDA
విశాఖ సిరిపురంలో ఉన్న ఫ్యూషన్ ఫుడ్స్‌ను ఉన్నట్టుండి ఖాళీ చేయించారు VMRDA అధికారులు. భారీ పోలీసు బందోబస్తు మధ్య హోటల్‌ను తొలగించారు. VMRDA స్థలంలో ఈహోటల్ నిర్వహణకు తమకు 2024 వరకూ లీజ్ ఉన్నప్పటికీ, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఖాళీ చేయించడం ఏంటని ఫ్యూషన్ ఫుడ్స్ యజమాని హర్ష మండిపడుతున్నారు. తాను TDP మద్దతుదారుడిని కావడం వల్లే కక్షపూరితంగా ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అర్థరాత్రి బందోబస్తుగా వచ్చి హోటల్‌లోని సామాన్లు తరలించే ప్రయత్నం చేయడం ఏంటని నిలదీశారు. వ్యాపారస్తులపై ఇలాంటి దౌర్జన్యాలకు దిగితే ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐతే, కార్పొరేషన్ అధికారులు మాత్రం లీజు ముగిసినందునే తాము చర్యలు తీసుకుంటున్నట్టు VMRDA అధికారులు వివరణ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com