రైతునుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టబడ్డ వీఆర్వో

ప్రకాశం జిల్లాలో రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్‌వోను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంతనూతలపాడు మండలం బి.మద్దులూరు గ్రామానికి చెందిన మధుసూదనరావుకి చెందిన భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి వీఆర్వో పూండ్ల శ్రీహరిబాబు లక్షన్నర డిమాండ్ చేశారు. దీంతో రైతు మధుసూదనరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మధుసూదన రావు నుంచి లక్షరూపాయలు లంచం తీసుకుంటున్న వీఆర్వో శ్రీహరిబాబును అధికారులు పట్టుకున్నారు. కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యారావు తెలిపారు.
Next Story