FEST: వైభవంగా పైడితల్లి అమ్మవారి కలశ జ్యోతుల ఊరేగింపు

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి కలశ జ్యోతుల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించి వనంగుడి నుంచి చదురుగుడికి వరకు కలశ జ్యోతులను ఊరేగించారు. 200మంది మాలదారులు కలశ జ్యోతులతో అమ్మవారి ఉత్సవ విగ్రహం వెంట రాగా కళాకారులు కోలాట, కళాప్రదర్శనలతో అంగరంగ వైభవంగా సాగింది. అమ్మవారి కలశ జ్యోతుల ఊరేగింపు నేపథ్యంలో ఆ మార్గం మొత్తం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆలయ ఈవో సుధారాణి, సిరిమానోత్సవ అధిరోహిత పూజారి వెంకటరావు మాట్లాడుతూ... పైడితల్లి అమ్మవారి నెలరోజుల ఉత్సవాల్లో భాగంగా కళశజ్యోతి ఊరేగింపు ప్రతియేటా జరుగుతుందన్నారు. దీపావళి పర్వదినం ముందుగా, చీకటిని పారద్రోలి వెలుగులు నింపే ప్రతీకగా ఆనవాయితీగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

Tags

Next Story