Yuvagalam 150th Day: అల్లూరులో లోకేష్ కు ఘన స్వాగతం

కోవూరు నియోజకవర్గంలో లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాల్టితో లోకేష్ పాదయాత్ర 150 రోజుకు చేరింది. అల్లూరులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఉదయం శ్రీపోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన లోకేష్...అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. లోకేష్‌ను చూసేందుకు జనం భారీగా వచ్చారు. రోడ్డుకు ఇరువైపుల ఉన్న భవనాలపైకి ఎక్కి అభివాదం చేశారు. ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు లోకేష్.
ఆయన్ను కలిసిన మహిళలు.... కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయని, కరెంట్ ఛార్జీల్ని ప్రభుత్వం విపరీతంగా పెంచిందంూ ఆవేదన వ్యక్తం చేసారు. రోడ్డు పక్కనున్న వ్యాపారస్తులని కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారపు. చెత్త , బోర్డు, వృత్తి పన్నులతో ప్రభుత్వం తమను వేధిస్తోందంటూ వ్యాపారస్తులు లోకేష్‌కు విన్నవించారు. ఈ ఈ పన్నులు తగ్గించాలని కోరగా... తమ ప్రభుత్వం అధికారంలోకి రాగనే అడ్డగోలుగా పెంచిన పన్నులను తగ్గిస్తామన్నారు. ఇక.. అల్లూరు మండల ప్రజలంతా.. లోకేష్‌కు వినతి పత్రం ఇచ్చారు. గోగులపల్లి, సింగంపేట గ్రామాల ప్రజలు తమ సమస్యలను లోకేష్‌కు చెప్పుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు లోకేష్.
నాలుగేళ్లలో జగన్ రెడ్డి స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారంటూ ఫైర్ అయ్యారు లోకేష్. పన్నులతో బాదేందుకే గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీల 33 వేల 502 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారంటూ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ... వైసీపి ప్రభుత్వం నిలిపివేసిన పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తామన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని.... ఇంటింటికి కుళాలు ఏర్పాటు చేసి స్వచ్చమైన తాగునీరు అందిస్తామన్నారు. విలీన గ్రామాల సమస్యపై మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com