నిన్నటి వరకు వాచ్‌మన్.. నేడు సర్పంచ్

నిన్నటి వరకు వాచ్‌మన్.. నేడు సర్పంచ్
నిన్నటి వరకు సచివాలయం గేటు దగ్గర వాచ్‌మన్ డ్యూటీ చేశారు

నిన్నటి దాకా సచివాలయం దగ్గర వాచ్‌మన్ డ్యూటీ చేస్తూ వచ్చే పోయే మంత్రులకు, అధికారులకు వంగి వంగి నమస్కారాలు చేసేవాడు. ఈ రోజూ ఆ ఊరికి సర్పంచ్ అయి అందరి నమస్కారాలు అందుకుంటున్నాడు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడుకు చెందిన గుంటూరు ఏసోబు గ్రామ సచివాలయం దగ్గర వాచ్‌మన్‌గా పని చేసేవాడు. ఈనెల 13న జరిగిన రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో ఏసోబు ఉంటున్న గ్రామం ఎస్సీ రిజర్వేషన్‌కు కేటాయించారు. దీంతో వైఎస్సార్ సీపీ మద్దతుతో ఆయన ఎన్నికలబరిలో దిగారు. 2,229 మంది ఓటర్లున్న ఆ గ్రామంలో జరిగిన ఎన్నికల్లో 232 ఓట్ల తేడాతో ఏసోబు విజయం సాధించారు. దాంతో తాను చేస్తున్న వాచ్‌మన్ డ్యూటీని వదిలి గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు సేవలు అందించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story