Kakinada Canal : అరుదైన దృశ్యం.. కెనాల్ లో నీటి కుక్కల సందడి

Kakinada Canal : అరుదైన దృశ్యం.. కెనాల్ లో నీటి కుక్కల సందడి
X

కాకినాడ జిల్లా సామర్లకోట రోడ్డు వెంబడి ఉన్న కెనాల్ లో నీటి కుక్కలు సందడి చేశాయి. వికే రాయపురం .. మాధవపట్నం మధ్య ఉన్న కాలువలో నీటి కుక్కలు కలియతిరిగాయి. ఇవి అరుదుగా కనిపించడంతో జనాలు వింతగా చూశారు. నీటి కుక్కలు ఎక్కువగా మడ అడవులు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో జీవిస్తాయి. ఒక్కొక్కసారి దారి తప్పి వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. అటు భూమి మీద ఇటు నీటిలో ఉండగలిగే ఉభయ చరాల్లో నీటికుక్కలు కూడా ఒకటి. కనుమరుగైపోతున్న జాతుల్లో నీటి కుక్కలు కూడా ఉన్నాయి. చేపలను ఆహారంగా తీసుకుని నీటికుక్కలు జీవనం సాగిస్తుంటాయి. అంతరించి పోతున్న అరుదైన జాతి కావటంతో వీటిని సంరక్షించాలని పర్యాటకులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Tags

Next Story