West Godavari: ఇంకా మత్తు దిగలే... తగ్గేదేలే..!

సంక్రాంతి వచ్చిందంటే చాలు పందెం రాయుళ్లు మీసం మెలేస్తారు. కొందరైతే పందెంలో ఎకరాలు పోయినా నిఖరంగా ఉండాలంటూ పెళ్లాం పుస్తెలమ్మీ మరీ పందాల్లో పాల్గొంటారు. ఇలా ఆస్తులు పోగొట్టుకొని ఆర్థీకంగా చితికిపోయిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వారి వీక్‌నెస్ ఆసరా చేసుకొని కొందరు కేటుగాళ్లు పండుగ ముగిసి పది రోజులైనా వాటిని నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాలో జూద క్రీడలు ఇంకా కొనసాగుతున్నాయి. దెందులూరు నియోజకవర్గం శ్రీరామవరం, పెదవేగి మండలం, కొండలరావు పాలెంలోయథేచ్ఛగా కోడిపందాలు సాగుతున్నాయి. వైసీపీ ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో జూద క్రీడలు సాగుతున్నాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బౌన్సర్లను కాపలా పెట్టి మరీ జూదక్రీడలను నిర్వహించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com