CM Chandrababu : నేడు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. ప్రధానంగా వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశం జరగనున్నట్లు సమాచారం. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపైనా ఎస్‌ఎల్‌బీసీ లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అలాగే ఏపీ విద్యుత్‌పై ముఖ్యమంత్రి సాయంత్రం 3 గంటలకు శ్వేత పత్రం విడుదల చేస్తారు. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో.. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ అందజేసింది.. మిగతా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. అదేవిధంగా రూ.18 వేల కోట్ల వరకు ప్రజలపై వివిధ భారాలు మోపారు. శ్లాబుల మార్పు, ట్రూఅప్, ఇంధన సర్దుబాటు తదితర ఛార్జీల పేరుతో గత ప్రభుత్వం భారీ వడ్డన మోపింది. షిర్డీ సాయి ఎలక్ట్రానిక్స్ కేటాయించిన కాంట్రాక్టులపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ట్రాన్స్‌ఫార్మర్లను అధిక ధరకు కొనుగోలు చేసినట్లు కూడా చెప్పనున్నారు.
రాష్ట్రంలో ఇసుక విధానంపై ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. శ్వేతపత్రం ద్వారా ఇసుకపై వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం ప్రజల ముందు ఉంచబోతోంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం అస్తవ్యస్తంగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. నిర్మాణ రంగం కుదేలైంది. ఈ పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చారు. అలాగే ఇవాళ విద్యుత్ రంగంపైనా శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com