ప్రియురాలితో కాపురం పెట్టిన భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

ప్రియురాలితో కాపురం పెట్టిన భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

పెళ్లి చేసుకున్న తనను కాదని.. ప్రియురాలితో కాపురం పెట్టిన భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది ఓ భార్య. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. చిత్తూరులో న్యాయవాది చంద్రమౌళి... తిరుపతిలోని పద్మావతి నగర్‌లో అద్దె ఇల్లు తీసుకుని ప్రియురాలితో కాపురం పెట్టాడు. అయితే దీన్ని గమనించిన భార్య కవిత... తన బంధువులతో కలిసి చంద్రమౌళిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఐతే.. ఇంటి వెనుక నుంచి గోడ దూకి పరారయ్యాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ ఇంటి వద్దనే బైటాయించింది బాధితురాలు. పోలీసులకూ ఫిర్యాదు చేసింది. గతంలో కాల్‌ మనీ కేసులో కూడా చంద్రమౌళి అరెస్ట్‌ అయ్యాడు. డబ్బు ఆశ చూపి అనేక మంది మహిళలతో అక్రమ సబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story