CRIME: రోడ్డుపై భర్తను కొట్టి.. ఉరేసి చంపిన భార్య

CRIME: రోడ్డుపై భర్తను కొట్టి.. ఉరేసి చంపిన భార్య
X
బాపట్ల జిల్లాలో దారుణం... మద్యం మత్తే గొడవకు కారణమని అనుమానం

బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై భర్తను భార్య చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమరేందర్ కుటుంబం కొంతకాలంగా నిజాంపట్నం మండలం కొత్త పాలెంలో ఉంటోంది. అయితే ఎమైందో ఏమో గాని వీళ్లిద్దరూ ఒక్కసారిగా నడిరోడ్డుపైకి వచ్చి ఘర్షణకు దిగారు. మాటామాటా పెరిగి పరస్పరం కొట్టుకున్నారు. విచక్షణ కోల్పోయిన భార్య.. భర్త తలపై కర్రతో కొట్టారు. దీంతో అమరేందర్ కిందపడిపోయారు. వెంటనే అమరేందర్ గొంతుకు తాడుతో ఉరేసింది. దీంతో భర్త అమరేందర్ అక్కడిక్కక్కడే మృతి చెందారు. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు. అమరేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మద్యం మత్తులో భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story