క్షుద్రపూజల కలకలం.. సృహతప్పి పడిపోయిన వ్యక్తి

క్షుద్రపూజల కలకలం.. సృహతప్పి పడిపోయిన వ్యక్తి
X

చిత్తూరుజిల్లాలో క్షుద్రపూజలు తీవ్రకలకలం రేపాయి. కుప్పం మండలం కృష్ణదాసనపల్లిలో క్షుద్రపూజల వ్యవహారం స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. నగేష్ అనే అతను సురేష్ అనే వ్యక్తికి తీర్థం తాగించడంతో అతను సృహతప్పి పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు సురేష్ ను కాపాడారు. నగేష్ అనే అతను క్షుద్రపూజలకు పెద్దయెత్తున ఏర్పాట్లుచేయడంతో గ్రామస్తులు జంకుతున్నారు. బాధితుడు సురేష్ కుప్పం పోలీస్టేషన్‌లో పిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తునారు. నిందితుడు నగేష్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story