అక్రమ సంబంధంపై నిలదీసినందుకు గర్భిణిని కత్తితో పొడిచి చంపిన మహిళ

అక్రమ సంబంధంపై నిలదీసినందుకు గర్భిణిని కత్తితో పొడిచి చంపిన మహిళ

కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్సార్ నగర్‌లో దారుణమైన ఘటన జరిగింది. అక్రమ సంబంధంపై నిలదీసినందుకు గర్భిణిని కత్తితో పొడిచి చంపేసింది సుశీల అనే మహిళ. బలమైన కత్తిపోట్ల కారణంగా లక్ష్మి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఇది గమనించిన స్థానికులు సుశీలను పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. గర్భిణి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది.

హైదరాబాద్‌లో ఉంటున్న లక్ష్మి నెలలు నిండడంతో కాన్పు కోసం ఇటీవలే పుట్టింటికి వెళ్లింది. అక్కడ అదే వీధిలో ఉండే సుశీల అనే మహిళతో గొడవ జరిగింది. తన తండ్రి వెంకటరాముడితో అక్రమ సంబంధంపై ఆ మహిళను నిలదీసింది. తల్లితో కలిసి సుశీలతో గొడవపడింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ మహిళ కత్తి తెచ్చి పొడిచేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

Tags

Next Story