PAWAN: మహిళలపై అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు: పవన్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తు శిల్పి.. స్త్రీ మూర్తి అని పేర్కొన్నారు. సోషల్ మీడియాల ద్వారా, వివిధ రూపాల్లో మహిళల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడే ప్రతి ఒక్కరిపైనా కఠినంగా వ్యవహరిస్తాం. మహిళల రక్షణ, సంక్షేమం మా ప్రభుత్వ బాధ్యత అని పవన్ వ్యాఖ్యానించారు. ‘సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తు శిల్పి.. స్త్రీమూర్తి. తన కుటుంబాన్ని చక్కదిద్దడం నుంచి పరిపాలన, కార్య నిర్వహణ, వాణిజ్య వ్యాపారాలు, పరిశ్రమల నిర్వహణ వరకూ ప్రతి విభాగంలో మహిళామణులు తమ బాధ్యతను దిగ్విజయంగా పోషిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన ప్రతి స్త్రీమూర్తికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అని పేర్కొన్నారు.
సమాజంలో వెలుగులు నింపే శక్తి స్త్రీనే: బాలకృష్ణ
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని దీని అర్థం అని నందమూరి బాలకృష్ణ వివరించారు. స్త్రీ స్వభావమే ఆది మాతృత్వం అని అభివర్ణించారు. కుటుంబాన్ని కాపాడే బలం, సమాజంలో వెలుగులు నింపే శక్తి, భవిష్యత్ పల్లవించే ప్రేమ మహిళల గొప్పదనం అని పేర్కొన్నారు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి మహిళా స్ఫూర్తిదాయకమే అని... వారిని గౌరవించుకోవడం మన విధి... వారిని కాపాడుకోవడం మన బాధ్యత అని బాలకృష్ణ అన్నారు. ఆదరణ, అంకితభావం, అజేయ సంకల్పం గల మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని బాలకృష్ణ సోషల్ మీడియాలో స్పందించారు.
మహిళా అభివృద్ధి తోనే సమాజ అభివృద్ధి: మంత్రి
కలలను సాకారం చేసుకున్నప్పుడే మహిళలకు నిజమైన సాధికారత లభించినట్లు అవుతుందని కాకినాడ జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ పేర్కొన్నారు. శనివారం కాకినాడ దంటూ కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు. సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు అభివృద్ధి చెందాలని. మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
మహిళా శక్తి లేనిదే దేశాభివృద్ధి లేదు: సీఎం
మహిళా శక్తి లేనిదే దేశాభివృద్ధి లేదంటూ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మన సంస్కృతిలో స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది, స్త్రీలను దేవతగా పూజించమని భారతీయ సంస్కృతి చెబుతోంది. సమాజానికి మహిళలే ప్రేరణ, మార్గదర్శకులు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు’. అని పుష్కర్ సింగ్ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com