Yanam: అమానవీయం: ఆవుపై పైశాచికత్వం

Yanam: అమానవీయం: ఆవుపై పైశాచికత్వం
గంజాయి మత్తులో పశువును వదలని దుండగులు...

మత్తు మనిషిని చిత్తు చేస్తుంది. మృగంగా మారుస్తుంది అనడానికి యానంలో చోటుచేసుకున్న ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. మత్తుకు చిత్తయిన వారు... మదమెక్కి, మతితప్పి విచక్షణారహితంగా ప్రవర్తిస్తుంటారు. అందులో భాగంగానే గుర్తు తెలియని దుండగులు గంజాయి మత్తులో ఓ ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డారు.


ఈ ఘటన యానాంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కొబ్బరితోటలో చోటుచేసుకుంది. పొగా ఈశ్వరరావుకు చెందిన పశువుల కొట్టంలో గుర్తు తెలియని దుండగులు ఓ ఆవు నాలుగు కాళ్లను, తలను కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది.

గురువారం ఉదయం ఈశ్వరరావు... పశువుల కొట్టంలోకి వెళ్లి చూడగా ఆవు చనిపోయి కనిపించింది. నాలుగు కాళ్లు, తల కట్టేసి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆవు చనిపోయిన తీరుపట్ల రైతు కన్నీరుమున్నీరయ్యారు.Tags

Read MoreRead Less
Next Story