ఏపీలో పెచ్చుమీరుతున్న వైసీపీ నేతల అరాచకాలు.. తాజాగా మరో దాడి..

ఏపీలో పెచ్చుమీరుతున్న వైసీపీ నేతల అరాచకాలు.. తాజాగా మరో దాడి..

ఏపీలో వైసీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఓ ప్రైవేట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌పై దాడికి తెగబడ్డారు. అక్రమ మట్టి తవ్వకాలు చేస్తుండగా... ప్రిన్సిపాల్‌ ఫొటోలు తీయడంతో దాడి చేశారు. ప్రిన్సిపాల్‌ మంతిన శ్రీనివాస్‌కు గాయాలు కావడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ పాల్పడుతున్నారని ప్రశ్నించడంతో వైసీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని బాధితుడు శ్రీనివాస్‌ తెలిపాడు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌, అతని మేనల్లుడు రామిశెట్టి చిన్నల నుంచి తనకు ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story