వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం : చినరాజప్ప

వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం : చినరాజప్ప

వరద బాధితులను ఆదుకోవడంతో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ హోంమంత్రి నిమ్మకాలయ చినరాజప్ప ఆరోపించారు. వర్షాలతో నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి... రైతులను పరామర్శించిన లోకేష్‌ను కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును, లోకేష్‌ను విమర్శించడం తప్ప... రైతులను ఆదుకోవాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నరు. టీడీపీ హయాంలో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద 3 వేల 100 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. లోకేష్‌పై జగన్‌ సర్కార్‌ అక్రమ కేసులు పెట్టడం దారుణమని చినరాజప్ప తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Tags

Next Story