టిడ్కో ఇళ్లపై సర్కార్‌ నిర్లక్ష్యం.. లబ్ధిదారుల మెడపై మారటోరియం కత్తి

టిడ్కో ఇళ్లపై సర్కార్‌ నిర్లక్ష్యం.. లబ్ధిదారుల మెడపై మారటోరియం కత్తి
లబ్ధిదారుల పేరు మీద రెండేళ్ల కాల పరిమితితో టిడ్కో అప్పు తీసుకుంది. వీటిలోచాలా ఇళ్ల రుణం గడువు జూన్‌తో ముగిస్తుంది

టిడ్కో ఇళ్లపై వైసీపీ సర్కార్‌ నిర్లక్ష్యం చూపుతోంది. దీంతో లబ్ధిదారుల మెడపై మారటోరియం కత్తి వేలాడుతుంది. లబ్ధిదారుల పేరు మీద రెండేళ్ల కాల పరిమితితో టిడ్కో అప్పు తీసుకుంది. వీటిలోచాలా ఇళ్ల రుణం గడువు జూన్‌తో ముగిస్తుంది. ఇప్పటికే కొన్నింటి గడువు పూర్తైంది. దీంతో లబ్ధిదారులకు గృహాలు అందకముందే నెల వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు వరుసగా మూడు నెలలు వాయిదాలు చెల్లించకపోతే డీఫాల్టర్‌గా మారనున్నారు. ఇదే జరిగితే భవిష్యత్తులో బ్యాంకులు లోన్లు ఇచ్చే అవకాశం ఉండదు. దీంతో పేదలకు రుణాలు మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. మారటోరియం గడువు మరో సంవత్సరం పొడిగించాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి సర్కార్‌ లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన లేదు.అనుమతిచ్చే అవకాశాలు తక్కువేనని అధికార వర్గాలు అంటున్నాయి.

మరోవైపు లబ్ధిదారుల పేరు మీద 365 చదరపు అడుగుల విస్తీర్ణం గలఇళ్లపై మూడు లక్షల పవదిహేను వేలు, 430 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇళ్లపై మూడు లక్షల అరవై ఐదు వేల రుణాన్ని రెండేళ్ల మారటోరియంతో బ్యాంకుల నుంచి టిడ్కో తీసుకుంది. ఒప్పందం మేరకు అన్ని అర్హతలూ పరిశీలించి వైసీపీ సర్కార్‌ ఏర్పడ్డాక 65 వేల మందికి బ్యాంకులు రుణాలు మంజూరు చేశారు. కొంతమంది రుణ మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో సొంతంగానే టిడ్కోకు చెల్లించారు. గడువులోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తే వారే 3 వేల చొప్పున నెల వాయిదాల్లో బ్యాంకులకు కట్టాలి. అయితే ఇప్పటి వరకు బ్యాంకులు రుణం మంజూరు చేసిన వాటిలో 40 వేల మంది లబ్ధిదారులకు సంబంధించిన గృహాలే పూర్తి చేసి అప్పగించినట్లు సమాచారం.

మరోవైపు బ్యాంక్‌ లోను తీసుకున్న కడప,అనంతపురంతో పాటు మరికొన్ని జిల్లాలకు చెందిన లబ్ది దారుల గృహ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. ఇవి పూర్తయ్యే పరిస్థితీ కనిపించడం లేదు.. అయితే వీటికి మారటోరియం గడువు ముగిసిపోనుంది.లబ్ధిదారులు నెల వాయిదాలు చెల్లించక పోతే మరో రెండు నెలల్లో ఎన్‌పీఏలుగా మారనున్న నేపధ్యంలో టిడ్కో లబ్ధిదారులకు కొన్ని బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story