గ్రామ సచివాలయ ఉద్యోగిపై దుర్భాషలాడి, భౌతిక దాడి చేసిన వైసీపీ నేత

గ్రామ సచివాలయ ఉద్యోగిపై దుర్భాషలాడి, భౌతిక దాడి చేసిన వైసీపీ నేత
కర్నూలు జిల్లా ఆదోని మండలం మండగిరి గ్రామ సచివాలయంలో స్థానిక వైసీపీ నేత కల్లుబోతు సురేశ్‌ రెచ్చిపోయాడు..

కర్నూలు జిల్లా ఆదోని మండలం మండగిరి గ్రామ సచివాలయంలో స్థానిక వైసీపీ నేత కల్లుబోతు సురేశ్‌ రెచ్చిపోయాడు. కార్యాలయంలోకి వెళ్లి.. ఉద్యోగులను ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో దూషించాడు. మా పనులే చేయరా అంటూ నానా హంగామా సృష్టించాడు. నరేంద్ర అనే అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ చెంప చెల్లు మనిపించాడు. వైసీపీ నేత సురేశ్‌ దాడిపై ఉద్యోగులంతా భయభ్రాంతులకు గురయ్యారు. "నేను వైసీపీ లీడర్‌"ను అంటూ... వీరంగం సృష్టించాడు. ఆఫీసులోని కుర్చీని విరిసేరి హల్‌ చేశాడు.

గ్రామ సచివాలయంలో వైసీపీ నేత కల్లోబోతు సురేశ్‌ చేసిన వీరంగంపై ఉద్యోగులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండిగిరిలోని వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి అనుచరులు అక్కడికి చేరుకుని సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ఏవోను బెదిరించి.. రాజీ చేసుకున్నట్టు లేఖ రాయించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు... తాము చేసిన తప్పేంటని ఉద్యోగులు నిలదీస్తున్నారు. ఆఫీసులోకి చొరబడి దాడికి దిగడమేంటని ప్రశ్నిస్తున్నారు. వైసిపి నేత కల్లుబోతు సురేశ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యోగులపై దౌర్జాన్యానికి దిగే వారిపై చర్యలు తీసుకోకపోతే తమ మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి యత్నించడం, ఉద్యోగిని కొట్టిన వైసీపీ నేతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారో ? లేక అధికార పార్టీ నేత కదా అంటూ రాజీ ప్రయత్నం చేస్తారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story