వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూత

వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూత
వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. కరోనాతో డిసెంబర్‌ 13న హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో చేరిన చల్లా గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. కరోనాతో డిసెంబర్‌ 13న హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో చేరిన చల్లా గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కర్నూలు జిల్లా అవుకుకు తరలించారు. 1948 జులై 27న జన్మించిన చల్లా రామకృష్ణారెడ్డి జాతీయ స్థాయిలో కృషి పండిట్‌ అవార్డు అందుకున్నారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004లో కోవెలకుంట్ల నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019లో వైసీపీలో చేరిన చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చల్లా రామకృష్ణారెడ్డి మృతిపై మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story