మరో వివాదంలో చిక్కుకున్న ఏపీ వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ రేవతి

మరో వివాదంలో చిక్కుకున్న ఏపీ వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ రేవతి

ఏపీ వడ్డెర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌ రేవతి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మేనల్లుడు వడియరాజు దౌర్జన్యానికి దిగాడు. గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణం నారాయణపురం క్రాంతి నర్సింగ్‌ హోమ్‌లో పనిచేస్తున్న సిబ్బందిపై దాడి చేశాడు. వైద్యం చేయించుకున్న దానికి బిల్లు కట్టమని అడగటంతో.. బిల్లు అంత అయిందా అంటూ గొడవకు దిగాడు. నేను ఎవరో తెలుసా.. వడ్డెర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి మేనల్లుడినంటూ బెదిరించాడు. సిబ్బంది డబ్బులు కట్టాల్సిందేనని చెప్పడంతో కాంపౌండర్‌ నాగరాజుపై చేయి చేసుకున్నాడు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డాక్టర్‌ క్రాంతికుమార్‌ తెలిపారు. ఈ వ్యవహారం ఇప్పుడు మరో సంచలనమైంది.


Tags

Read MoreRead Less
Next Story