వంశీతో కలిసి పనిచేయను : యార్లగడ్డ వెంకట్రావు

X
By - kasi |5 Oct 2020 6:20 AM IST
గన్నవరం వైసీపీలో గ్రూపు రాజకీయాలు వీధికెక్కాయి. వల్లభనేని వంశీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం వైసీపీలో తనకు గ్రూపులు లేవన్నారు. వంశీతో కలిసి పనిచేయనని సీఎం జగన్‌కు చెప్పానన్నారు. తనను, కార్యకర్తలను అనేక రకాలుగా వంశీ ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వెళ్లడించారు. తన జన్మదిన వేడుకలను నిర్వహించొద్దని వంశీ కార్యకర్తలను బెదిరించినట్లు వెల్లడించారు. ఈ విషయంలో పోలీసులు ఓవరాక్షన్ చేస్తూ... కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పార్టీని బలహీన పరచడం ఇష్టంలేకే తాను గన్నవరం వెళ్లటం లేదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com